నల్లకుంటలో సర్వే నిర్వహించిన అధికారులు

jayyapal jvs media
1 minute read

 నల్లకుంటలో సర్వే నిర్వహించిన అధికారులు



నివేదిక జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామన్న తహసిల్దార్ 


హైకోర్టు ఉత్తర్వుల మేరకు బాదేపల్లి లోని సర్వేనెంబర్ 75 లో ఉన్న నల్లకుంట లో గురువారం సర్వే నిర్వహించారు. 

75 సర్వే నెంబర్ లో మొత్తం సుమారు 14 ఎకరాల భూమి ఉంది. అందులో వివాదాస్పదమైన భూమిని గురువారం అధికారులు సర్వే జరిపారు తాసిల్దార్ నర్సింగ్ రావు ఇరిగేషన్ కృష్ణమోహన్ డిగి కృష్ణ తో పాటు సర్వేయర్ సాయిరాం ఇరిగేషన్ ఏ ఇల్లు సర్వేలో పాల్గొన్నారు. సర్వే నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తహసిల్దార్ స్పష్టం చేశారు. సర్వే నిర్వహించిన భూమిలో నిర్మాణాలు జరగడం పట్ల జడ్చర్ల లో ఆందోళన చోటుచేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే భూ యజమాని కోటను ఆశ్రయించగా ఇరిగేషన్ శాఖ అధికారుల సైతం వాదోపవాదాలు చేశారు నిర్మాణం స్వచ్ఛందంగా తొలగించుకోవాలని భూ యజమానులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా సర్వేది నిర్వహించాలని సూచించగా ఆ సూచనల మేరకు గురువారం సర్వే జరిపారు.

సర్వే సందర్భంగా భూ యజమాని శివప్రసాద్ మాట్లాడుతూ ఏడెకరాల భూమి తమదని ఆ భూమి చుట్టూ ప్రహరీ రేకులు నిర్మించామన్నారు. 

పట్టాదారులకు ఉన్న ఏడు ఎకరాల భూమిలో రైల్వే ట్రాక్ కింద నుంచి ఏర్పాటు చేసిన రోడ్డు డ్రైనేజీ స్థలము మూడు ఎకరాలు పోను వాళ్లకు మిగిలింది నాలుగు ఎకరాలు మాత్రమే. ఇప్పుడు సర్వే చేస్తే ఇంకో ఎకరం పొలం కూడా బఫర్ జోన్లకు వస్తదని తెలపడంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 

ఈ విషయాన్ని కూడా కోర్టు పరిధిలో తేల్చుకుంటామని తెలిపారు.అలాగే ప్రభుత్వ అధికారుల సర్వేను తప్పుపట్టారు మా ఏడెకరాల పొలం ఎక్కడుందో మాకు చూపించి మార్కింగ్ చేసి హద్దులు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

Tags
Chat