సర్పంచుల పెండింగ్ బిల్లుల కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టిన సర్పంచుల సంఘం నాయకులను జడ్చర్ల పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, గ్రామపంచాయతీలో సొంత నిధులతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అవుతాయి అని అభివృద్ధి కార్యక్రమాలు చేసి సర్పంచులు 15 నెలలుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనం లేనట్టు సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదు, చాలామంది సర్పంచులు మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, దయచేసి ఈ అసెంబ్లీ సమావేశంలోనైనా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ కోరుతున్నారు, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి మరియు ఆలూరు సర్పంచ్ సుకన్య వెంకట రెడ్డి అరెస్టు చేశారు.