జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి భార్యతో గొడవ జరగడంతో.
గత కొంతకాలంగా భార్య తన పుట్టింటి దగ్గర ఉంటుంది.
ఎంతకీ తిరిగి అత్తవారింటికి రాకపోవడంతో ఈరోజు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ ద్వారా తన భార్యకు సమాచారం తెలిపాడు
ఇట్టి విషయాన్ని మహేష్ భార్య తన ఆడబిడ్డకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా హైదరాబాద్ లో ఉంటున్న మహేష్ చెల్లెలు డైలీ 100 కు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది.
జడ్చర్ల డయల్100 సిబ్బంది ఫోన్ లో విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ సత్యపాల్ మరియు జనార్దన్ ఇరువురు జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమలాకర్ కు సమాచారం అందించారు . సీఐ కమలాకర్
ఆదేశాల మేరకు మహేష్ ఫోన్ యొక్క లొకేషన్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్లి అతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు.
విషయం తెలుసుకున్న స్థానికులు కానిస్టేబుల్ ఇద్దరిని సమయస్ఫూర్తితో డైలాగ్ ఫోన్ చేసి నా వెంటనే స్పందించిన సిఐ కి ధన్యవాదాలు తెలిపారు.