బొట్టు పెట్టుకుని బడికి వచ్చిన విద్యార్ధి.. ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌! ఏం జరిగిందంటే..

 పెద్దఅంబర్‌పేట, మార్చి 4:




 ఓ విద్యార్ధి స్కూల్‌కు బొట్టుపెట్టుకుని రావడం మహా పాపమైంది. గమనించిన ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ విద్యార్ధిని చితకబాడి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. దెబ్బకు దిగొచ్చిన స్కూల్‌ యాజమన్యం సదరు ప్రిన్సిపల్‌ను ఏకంగా సస్పెండ్‌ చేసి పారేసింది. ఈ విచిత్ర ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలోని ఓ స్కూల్లో సోమవారం (మార్చి 3) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 

బొట్టుపెట్టుకుని స్కూల్ కి వచ్చిన విద్యార్ధిని ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ చితకబాడి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. దెబ్బకు దిగొచ్చిన స్కూల్‌ యాజమన్యం సదరు ప్రిన్సిపల్‌ను ఏకంగా సస్పెండ్‌ చేసి పారేసింది. ఈ విచిత్ర ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలోని ఓ స్కూల్లో సోమవారం (మార్చి 3) చోటు చేసుకుంది..పెద్ద అంబర్‌పేటలోని క్యాండర్‌ ష్రైన్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బొట్టుపెట్టుకుని సోమవారం ఉదయం ఎప్పటి మాదిరిగానే బడికి వచ్చాడు. ఉదయం ప్రతిజ్ఞ అవగానే విద్యార్ధులంతా తమ తమ తరగతుల్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గమనించిన ప్రిన్సిపల్‌ లక్ష్మయ్య వెంటనే తన రూమ్‌కి పిలిపించాడు. స్కూల్‌కు ఎందుకు బొట్టు పెట్టుకుని వచ్చావని విద్యార్ధిని నిలదీశాడు. అంతేనా.. వెర్రి కోపంతో విద్యార్థిని పట్టుకుని చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్ధిని బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తొలగిపోయేంత వరకూ ముఖం కడిగించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్ధి సాయంత్రం ఇంటికెళ్లగానే తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పాడు.

ప్రిన్సిపల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు విద్యార్థి తల్లిదండ్రులు మంగళవారం ఉదయం స్కూల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. బొట్టు పెట్టుకుంటే కొడతారా? అని నిలదీశారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వివాదం ముదరడంతో చేసేదిలేక స్కూల్ యాజమాన్యం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసింది.


Previous Post Next Post

نموذج الاتصال

Follow Me