పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.50,000 జరిమానా విధింపు




బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరు


మహబూబ్నగర్ జిల్లా, కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భిణీ చేసిన నిందితుడికి నేరం నిరూపితమైనందున, మహబూబ్నగర్ జిల్లా పోక్సో కోర్ట్ న్యాయమూర్తి  టి. రాజేశ్వరి  ఈ రోజు తీర్పును వెలువరించారు.


నిందితుడు దుప్పుల ఆనంద్ (వయసు 21 సంవత్సరాలు, తండ్రి: దుప్పుల ఆంజనేయులు, నివాసం: కేశవాపూర్ గ్రామం, కోయిలకొండ మండలం) 14 ఏళ్ల మైనర్ బాలికపై 2020 డిసెంబర్ 21న అత్యాచారం చేశాడు. దీనిపై బాలిక తల్లి దుప్పుల మంగమ్మ (వయసు 40 సంవత్సరాలు) పోలీసులకు ఫిర్యాదు చేయగా, కోయిలకొండ ఎస్సై సురేష్ గౌడ్  ఆధ్వర్యంలో Cr. No. 138/2020 నమోదు చేసి, IPC 376(3), సెక్షన్ 5(l), (j)(ii), (n) r/w 6 of POCSO Act, 2012 కింద కేసు దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తును మహబూబ్నగర్ రూరల్ సీఐ డీకే మహేశ్వరరావు పర్యవేక్షించగా, నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయబడింది. Sri B. బాలస్వామి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. నేరం రుజువైనందున, జిల్లా పోక్సో కోర్ట్ నిందితుడికి జీవితఖైదు మరియు రూ.50,000 జరిమానా విధించింది.


బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయడం జరిగింది.


ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ  డి. జానకి, ఐపీఎస్  మాట్లాడుతూ, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. బాలస్వామి, ఎస్సై సురేష్ గౌడ్, సీఐ డీకే మహేశ్వరరావు, ఏఎస్ఐ బాలకృష్ణ (పోక్సో కోర్ట్ లైసెన్ ఆఫీసర్), పోలీసులు కృష్ణయ్య, శంకర్ నాయక్, శేఖర్ గౌడ్ లను అభినందించారు.



Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!

Online

  1. TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అయ్యప్ప

  1. అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్ l Ayyappa Swamy Bhajana Songs Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me