- శిక్షను ఖరారు చేసిన నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ ఎస్సీ, ఎస్టీ కోర్టు
- వివిధ అంశాల ఆధారంగా 27 ఏళ్ల జైలు శిక్ష ఖరారు
- జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా
దళిత యువతిపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. ఒకే కేసులో వివిధ అంశాల ఆధారంగా 27 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.
నిందితుడు దళిత యువతిని ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారం చేశాడు. ఇందుకు పదేళ్ల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా విధించింది. దళిత యువతిని మోసగించినందుకు మరో పదేళ్లు, పెళ్లి పేరుతో మోసగించినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 1,000 జరిమానా విధించింది.
మొత్తం 27 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేస్తూ నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు.
Tags
police