సూర్యగ్రహణం.. శని సంచారము
మార్చి 29, 2025న సూర్యగ్రహణంతో పాటు మరో ముఖ్యమైన జ్యోతిషశాస్త్ర సంఘటన జరగబోతోంది. అదే శని సంచారము. ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉన్నాడు. మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక ప్రత్యేక యాదృచ్చికం కానుంది. ఎందుకంటే.. 100 సంవత్సరాల తర్వాత ఒకే తేదీన 2 యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి.
Solar Eclipse 2025: 100 ఏళ్ల తర్వాత యాదృచ్ఛికాలు రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో దాని ప్రభావం ఏమిటి?
ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో 2025 మార్చి 29న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ రోజున తెలుసుకుందాం..ఈ సంవత్సరం హోలీ సందర్భంగా అంటే మార్చి 14న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ 2025న సంభవిస్తుంది. ఈసారి మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నదని మాత్రమే కాదు.. ఈ రోజున ఒకేసారి అనేక శుభ యోగాలు ఏర్పడతాయి కనుక. జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గుణ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరగనున్నాయి. జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. మార్చి 29న సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అందరూ మీన రాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా ఉంటుంది.
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా?
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు.. సూర్యుడికి, భూమికి మధ్య వచ్చినప్పుడు.. చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కనుక భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహానికి మన దేశంలో మతపరమైన ప్రభావం ఉండదు. సూతక కాలం కూడా చెల్లదు. అటువంటి పరిస్థితిలో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపదు.