Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..


 హైదరాబాద్: హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం (Laxmareddipalem) వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) సంభవించింది. రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి (Additional SP TM Nandeeshwara Babji) ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ (శనివారం) ఉదయం వాకింగ్ కోసమని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదాని వైపునకు ఏఎస్పీ బాబ్జి వెళ్లారు. ఈ క్రమంలో జాతీయ రహదారిని దాటేందుకు ఏఎస్పీ బాబ్జి యత్నించారు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబ్జి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఏఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. మరోవైపు బాబ్జి మృతి పోలీసు శాఖను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 

Previous Post Next Post

Education

  1. KGBV Admissions: ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు - New!
  2. TGRJC CET Notification 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - 'టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌' ప్రకటన విడుదల - దరఖాస్తు తేదీలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

ఇతర

  1. 11. మానవుడా మమత వీడరా - Manavuda Mamatha Veedara - భజన పాటల లిరిక్స్ - New!

نموذج الاتصال

Follow Me