Rain: నగరంలో.. వడగళ్ల వాన

 



హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీగా వర్షం కురిసింది. గత ఐదారు రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజానీకానికి ఈ వర్షం కొంచెం ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. కాగా.. ఈ వర్షం కారణంగా ఆయా ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒకపక్క ఉక్కపోత, మరోపక్క దోమలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడ్డారు.



హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌(Jubilee Hills, Ameerpet, SR Nagar), మియాపూర్‌, మదీనాగూడ, ప్రగతినగర్‌, బాచుపల్లి, బోరబండ, మధురానగర్‌, బోయిన్‌పల్లి, ప్యారడైజ్‌, గండిమైసమ్మ(Boynpally, Paradise, Gandimaisamma), ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Previous Post Next Post

نموذج الاتصال