సైబర్ నేరాలపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (వుమెన్) నందు అవగాహన కార్యక్రమం*

 


*సైబర్ జాగృక్ దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (వుమెన్) నందు అవగాహన కార్యక్రమం*


జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ జాగృక్ దివస్ ను పురస్కరించుకొని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (వుమెన్) నందు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ కె.సుదర్శన్ గారు, విద్యార్థినులకు సైబర్ నేరాల గురించి వివరించారు.


ఈ కార్యక్రమంలో ముఖ్యంగా

👉 Digital Arrest Fraud

👉 Betting/Gaming Apps మోసాలు

👉 IPL Tickets Scams

వంటి ఆన్‌లైన్ మోసాల గురించి వివరించి, అవి ఏ విధంగా జరుగుతాయో, బాధితులు తగిన జాగ్రత్తలు ఎలా పాటించాలన్న దానిపై స్పష్టమైన అవగాహన కల్పించారు.


సైబర్ నేరాలు జరిగిన వెంటనే పిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న సేవలు: 

🔹 సైబర్ క్రైం రిజిస్ట్రేషన్ పోర్టల్: Cybercrime.gov.in

🔹 టోల్-ఫ్రీ నంబర్: 1930

🔹 WhatsApp హెల్ప్‌లైన్: 8712672222


ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎమ్. గోపాల్, సైబర్ క్రైమ్ ఎస్ఐ పి. శ్రవణ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జయప్రద, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


సమాజంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరం అని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నిబంధనలను పాటించి, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ఉం

డాలని సూచించారు.


Previous Post Next Post

نموذج الاتصال