SLBC Tunnel Rescue: టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. మిగతా ఆరుగురి కోసం..

 

SLBC Tunnel Rescue: టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. మిగతా ఆరుగురి కోసం..


SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించారు. కన్వేయర్‌ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది.. మిగతా ఆరుగురి జాడ కోసం 32వ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మట్టి, నీరు, TBM శకలాల తరలింపు పనుల్లో రెస్క్యూ సిబ్బంది మరింత వేగం పెంచారు. SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించారు. కన్వేయర్‌ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది.. మిగతా ఆరుగురి జాడ కోసం 32వ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మట్టి, నీరు, TBM శకలాల తరలింపు పనుల్లో రెస్క్యూ సిబ్బంది మరింత వేగం పెంచారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌ శివశంకర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది ప్రభుత్వం.. అంతేకాదు, మృతదేహాలన్నీ దొరికేవరకూ ఆపరేషన్‌ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పలు సలహాలు సూచనలు కూడా చేసింది.. ఈ క్రమంలోనే.. 32వరోజు.. ఓ మృతదేహం లభ్యమైంది.. మరో ఆరుగురి జాడ కోసం రెస్క్యూను మరింత ముమ్మరం చేశారు. అయితే.. SLBC రెస్క్యూ ఆపరేషన్‌.. అత్యంత కష్టంగా రిస్కీగా మారినట్లు పేర్కొంటున్నారు అధికారులు.. సీపేజ్‌ కారణంగా స్పాట్‌ పాయింట్‌ నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కిలోమీటర్‌ మేర సొరంగం గుల్లగా మారడంతో కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.. దాంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు నిపుణులు.. ముఖ్యంగా రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తోంది నిపుణుల బృందం..

ప్లాన్‌-A.. ఇందులో భాగంగా D ఆకారంలో బైపాస్‌ రూట్‌ తవ్వడం.. అందుకోసం కొండ పైనుంచి బ్లాస్ట్‌ చేయాలన్నది ప్లాన్‌.. అయితే.. సొరంగం పైనుంచి సుమారు 500 మీటర్ల ఎత్తు వరకు దాదాపు కిలోమీటర్‌ మేర కొండను తొలగించాల్సి ఉంటుంది.. అయితే, ఈ ప్లాన్‌ అమలు చేయాలంటే అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్లాన్‌-B.. ఇందులో అపోజిట్‌ మార్గంలో టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌తో డ్రిల్లింగ్‌ చేసుకుంటూ రావడం.. అయితే, ఇది చేయాలంటే ఆరేడు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఉంది.. ఎందుకంటే, మన్నెవారిపల్లి నుంచి పనిచేస్తున్న టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కూడా పనిచేయకపోవడంతో ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది.. ఈ రెండు ప్లాన్స్‌లో దేనిపైన ముందుకెళ్లాలన్న నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!

Online

  1. TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అయ్యప్ప

  1. అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్ l Ayyappa Swamy Bhajana Songs Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me