కందమూరి బ్రహ్మయ్య ఆచార్య జయశంకర్ విశ్వబ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
పాలమూరు ఎటు పోతుంది !? పాలమూరుకు చరిత్ర ఉంది విలువైన రాజకీయాలు ఇక్కడ వస్తున్నాయి.
మల్లన్న నీ పార్టీ ఏది నీ మద్దతు ఎటువైపు. ఒకసారి బిజెపి ఒకసారి కాంగ్రెస్ ఇప్పుడు అదే కాంగ్రెకాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీల నినాదంతో బీసీ లను రెచ్చ గొట్టి ముందుకు వస్తున్నావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవు చేపట్టిన ఎన్నికల ప్రచారం లో అందరూ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థులకే మద్దతు పలికి గెలిపించేలా కృషి చేసినావు మీరు చేసిన ఇంటర్వ్యూలలో కూడా రెడ్డి సామాజిక వర్గం ధనవంతులని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూ లు చేసి అక్కడ అధికారం ఇచ్చి ఇక్కడ బీసీలను రాజ్యాధికారం కోసం చైతన్యం చేస్తానని బిసి ఉద్యమ మని ఎందుకు రెచ్చ గొడుతున్నావు బీసి వాదం నిన్ను నీవు కాపాడుకోవడం కోసమా ప్రజల బాగు కోసమా ఏ రకంగా నమ్మాలి ప్రజాసంఘాలలో కుల సంఘాలలో నీ అనుభవం ఏమిటి ఏంది ఎంతమంది కుల సంఘ నాయకులను సంప్రదించి జేఏసీ ఏర్పాటుచేసినావు నీ భాష ప్రజా స్వామిక పద్ధతిలో ఉందా ? నీ ఎజెండా ఏమి?
పాలమూరులో విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉన్నాయి. ఇంతవరకు ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయాలకు కులాలను గాని బీసీ సెంటిమెంట్లను గాని వాడుకున్న దాఖలాలు లు ఎక్కువగా లేవు. ఎప్పుడు కూడా ఎవరిని రెచ్చగొట్టి ఓట్లు పొందలేదు. ఎర్ర సత్యం పొడపాటి చంద్రశేఖర్ పులి వీరన్న డాక్టర్ బలకిస్తయ్య నర్సింహులు నాయుడు వంటి ఎంతో మంది ఎంఎల్ఏ లు ప్రజా సేవతో మంచి తనం తో రాజకీయాల్లో నెగ్గరు. ఒకరిద్దరి నాయకులను వేసుకొని వాళ్లే కుల సంఘాలన్నీ వాళ్లే కుల సంఘాలని జేఏసీ అని నియంతకు మీరే ప్రచారం చేసుకొని ఇక్కడ ఏదో సాధిస్తున్నావు అన్నట్లు ప్రచారం చేస్తే అది సబబు కాదు స్నేహపూర్ లో వాతావరణం కక్షలు కార్పన్యాలతో నింపడం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందరినీ కలుపుకొని పోవాలి అందరి బాగు కోసం నీ ఎజెండా ఉండాలి. అందర్నీ కలుపుకొని పోవాలి అందరి బాగుకోసం కృషి చేయాలి నీ ఒక్కని కోసం బీసీ నినాదమంటి వేరే సామజిక వర్గాలను తిడుతూ ఇక్కడ ఉన్న మా బీసీ పిల్లలకు నీ రంగు రూస్తే వాళ్ళ భవిషత్తు ఏమౌతుంది . నీ పేరు మీద టీం అని పెట్టుకోవడం అనేది అహంకారపూరితమవుతుంది డిక్టేటర్ షిప్ అవుతుంది ప్రజల మేలు కోసం సంక్షేమం కోసంమేలు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ప్రజా సంఘాలను కూడ గట్టి ఇక్కడ మేము సంఘాలను ఏర్పాటు తీసుకున్నము . వాటిని విడదీసి నీ పబ్బం కడుక్కునే ప్రయత్నం చేయకు ఇక్కడ నాయకులు కూడా మరొకసారి పునరాలోచించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన బాబు కోసం మనము పోరాటం చేయడం నేర్చుకోవాలి ఎవరు వస్తే వాళ్లకు వేదిక ఏర్పాటు చేసి బీసీల మధ్యల చిచ్చు పెట్టరాదు