అంతర్జాతీయ జల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు నందు చిత్రలేఖన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగినది. జల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు . యుగంధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వా డుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. సోషల్ ఉపాధ్యాయులు షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఇంటి దగ్గర ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.. సైన్స్ ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రకృతిలో కేవలం మనుషులు మాత్రమే నీటిని వృధా చేస్తున్నారని మిగతా ఏ జీవులు కూడా వృధా చేయటంలేదని కావున విచక్షణతో నీటిని వాడుకొని భవిష్యత్ తరాల వారికందించాలని వివరించారు.
చిత్రలేఖనం, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ హరినాథ్ అబ్ధుల్ అలీం,సంధ్య ,హైమావతి, సోముల నాయక్ ,నిర్మల మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొ