కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్... కేసీఆర్ ప్రజాధనాన్ని వృధా చేసిండు: వివేక్ వెంకటస్వామి

jayyapal jvs media
2 minute read
Caption of Image.

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. అవినీతి కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  మంచిర్యాల జిల్లా  అన్నారం బ్యారేజీ వరద వల్ల ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామ పంట భూములను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ అధికారులతో రైతుల సమక్షంలో కరకట్ట నిర్మాణం కోసం సమీక్షించారు.  నాలుగేళ్లుగా అన్నారం బ్యారేజీ వరద,  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్  వాటర్ వల్ల   జరిగిన పంట నష్టంను ఎమ్మెల్యే వివేక్ తో చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు   గ్రామ రైతులు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..కేసీఆర్ పై విమర్శలు చేశారు. తుమ్మిడి హెట్టి నుండి గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టును కాదని కేసీఆర్  కాళేశ్వరం రీ డిజైన్ చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్లు ఇవాళ ప్రపంచంలోనే ధనికులయ్యారని విమర్శించారు. కేసీఆర్ పైన, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్లపైన ఈడీ విచారణ చేయాలన్నారు.  తనపై బాల్క సుమన్ ఒక్క ఫిర్యాదు చేయగానే ఈడీ విచారణ చేశారు..  తాను గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేక సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు.  నియోజకవర్గంలోని బ్యాక్ వాటర్ సమస్యను ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారిస్తామన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/oQ2vbM9
via IFTTT
Tags
Chat