జడ్చర్లలో ఒకవైపు అంబేద్కర్కు అవమానం రెవిన్యూ కార్యాలయంలో జెండాని ఎగరవేయడంలో తప్పులు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
ముందుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ బాబు జెండాను ఎగరవేసి వందనాలు సమర్పించారు.
జడ్చర్ల మండల తాసిల్దార్ కార్యాలయం పై ఎమ్మార్వో జెండాను ఎగరవేశారు జెండా ఎగరవేసే క్రమంలో స్వతంత్ర దినోత్సవం నాడు ఎలా ఎగరవేస్తాము గణతంత్ర దినోత్సవం లో ఉన్నాడు ఎలా ఎగరవేస్తామో తేడా తెలియకుండా ఎగరవేసిన వైనం.
స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను కింది నుంచి పైకి ఫాస్ట్గా తీసుకెళ్లి ఎగరవేసి అమరులకు నివాళులర్పించి స్వతంత్రోత్సవానికి పోరాడిన అమరులను తలుచుకుంటాం.
గణతంత్ర దినోత్సవం నాడు స్వయం పరిపాలన దినోత్సవం రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా జండా కర్రకు చివరన జెండాను కట్టి డైరెక్టుగా జెండాను ఎగరవేయాలి కానీ జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం నాడు ఎలా ఎగరవేస్తామో అలా ఎగురవేసి తప్పు చేసిన మండల రెవెన్యూ తాసిల్దార్.
ఎమ్మార్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అంబేద్కర్ మహనీయునికి ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ అధికారులు కనీసం అంబేద్కర్ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఒక దండ కూడా వేయని వైనం చూస్తుంటే అంబేద్కర్ పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది అని రెవిన్యూ అధికారులు రెవిన్యూ కార్యాలయం దగ్గరలో ఉంటుంది అని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో జడ్చర్ల పట్టణంలోని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇంత పెద్ద మహనీయుడైన అంబేద్కర్ ని అవమానించిన అధికారులు ప్రజలకు ఏమి సేవ చేస్తారు అని అంటున్నారు అధికారులు తమ హక్కుల పట్ల ఎంత కఠినంగా ఉంటారు మరి తమ విధులు బాధ్యతలు పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అర్థం కాని పరిస్థితి.
ఇకమీదటన్న అధికారులు కుల మత వర్గ వర్ణ లకు సంబంధం లేకుండా జాతీయ నేతలను నాయకులను వారి వారి వర్ధంతిలు జయంతులు ఇలాంటి దేశ ఆనికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు అందరికీ సమన్యాయం పాటించాలికానికి ఇలా అవమానించడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
*August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దు*
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.
అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.
*ఆ తేడా ఏమిటో తెలుసుకుందాము*👇
👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
*ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.
👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.
( *గమనిక*: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).
దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.
స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.
అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే..
👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting).
👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) .
ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.
👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.
👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).
కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.