జడ్చర్ల రూరల్:-జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు సాయంకాలం ఎరుకలి మల్లేష్ వయసు 40 సంవత్సరాలు ట్రాక్టర్ డ్రైవర్ గ పనిచేస్తున్నాడు.
ట్రాక్టర్ తో వరి సాగు నాటడం కోసం కరిగేట చేస్తుండగా ట్రాక్టర్ రివర్స్ చేసే క్రమంలో ట్రాక్టర్ ఇంజన్ గాల్లోకి లేచింది డ్రైవింగ్ సీట్లో ఉన్న మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
మృతదేహాన్ని బాదేపల్లి లోని ప్రభుత్వ మార్చరికి తరలించారు.
చనిపోయిన వ్యక్తి కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జడ్చర్ల సిఐ కమలాకర్ తెలి
పారు.
Tags
Jadcherla