Telangana: మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!


 లంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గానూ లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అప్లికేషన్ రుసుము 3 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.2025-2027 సంవత్సరానికి వైన్స్ షాప్ టెండర్ల కు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష రూపాయలు పెంచి రూ. 3 లక్షలు చేసింది. ఫిక్స్‌డ్ షాప్ టాక్స ఆధారంగా లాటరీ పద్దతిలో వైన్ షాపులను కేటయించనున్నారు. దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు. లైసెన్స్ కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు మాత్రమే నిర్ణయించారు.

ఇకసారి మద్యం షాపు కేటాయింపుల్లో 30 రిజర్వేషన్లకు కేటాయించారు. గౌడ్స్ సామాజిక వర్గానికి 15 శాతం, షెడ్యూల్ కులాల సామాజిక వర్గాలనికి 10 శాతం, షెడ్యూల్ తెగల సమాజిక వర్గానికి 5 శాతం వైన్స్ షాపులను కేటాయించనున్నారు. టెండర్ల ప్రక్రియల్లో పాల్గొనేందుకు భాగస్వామ్య సంస్థలకు, కంపెనీలకు సైతం అవకాశం కల్పించారు. ఈసారి లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంపికైన లైసెన్స్‌దారులు 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లుకునేందుకు వీలు కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే.. ఏటికేడు ఈ వ్యాపారం వైపు చొరవ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. కాగా, వైన్స్ షాపు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తుది తేదీలను ప్రకటించాల్సి ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال