మహబూబ్నగర్ జిల్లా ఏఎస్ఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించిన భారత ప్రభుత్వం

 



*మహబూబ్ నగర్ జిల్లా ASI కి (IPM) ఇండియా పోలీస్ మెడల్ ప్రకటించిన భారత ప్రభుత్వం*



79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్, ASI 565 IPM (Indian Police Medal) ని భారత ప్రభుత్వం ప్రకటించింది.


మొహమ్మద్ మొయిజుద్దీన్ 1989 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా నియమితులై, అలంపూర్, తిమ్మాజిపేట్, జడ్చర్ల, పెద్దకొతపల్లి, కోస్గి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది DCRBలో, 2018లో ASIగా పదోన్నతి పొంది CCS మహబూబ్‌నగర్, హన్వాడ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.


తన విశిష్ట సేవలకు గాను ఇప్పటివరకు నగదు రివార్డులు, 18 GSEలు, 12 ప్రశంస పత్రాలు, 1 సేవా పతకం (2013), టీఎస్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం (2017), ఉత్తక పోలీస్ పతకం (2019) అందుకున్నారు.


ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ డి. జానకి, , మొహమ్మద్ మొయిజుద్దీన్ గారిని అభినందిస్తూ, “పోలీసు శాఖలో ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం. ఈ పురస్కారం ఆయన కృషికి లభించిన గౌరవం” అని పేర్కొన్నా

రు.

Previous Post Next Post

نموذج الاتصال