ఐదవ పెళ్ళికి సిద్ధియం అయిన కానిస్టేబుల్‌ కృష్ణంరాజు

 

Suryapet: కానిస్టేబుల్‌గా కృష్ణంరాజు .. ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు..

సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణంరాజు కథే వేరే. అయ్యగారు పెళ్లిళ్లు చేసుకోవడంతో పీహెచ్‌డీ చేశాడు. మొదటి మూడు పెళ్లిళ్లతో ఆగకుండా, మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడని సమాచారం ..
సూర్యాపేట జిల్లాలో ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుని వేధించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. సదరు కానిస్టేబుల్‌పై పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కృష్ణంరాజు పని చేస్తున్నాడు. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్నా.. ఇతని బుద్ధి మాత్రం తప్పుదారి పట్టింది. 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణం రాజుకు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో మొదటి వివాహం జరిగింది. ఐతే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెతో పొసగక పోవడంతో విషయం కోర్టుకెక్కింది. ఆమెతోనూ విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తోంది. కానీ ఆ కేసును నడుస్తుండగానే ముచ్చటగా మూడో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక కృష్ణం రాజు.. అంతటితో ఆగలేదు. సూర్యాపేటకు చెందిన పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇది చట్ట విరుద్ధం అని తెలిసినా.. ఆ కామాంధుడు ఆ బాలికను శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో కీచక కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేక.. తను కూడా పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో ఆమెను కూడా దూరం పెట్టేశాడు కృష్ణం రాజు. తిరిగి ఐదో పెళ్లికి కానిస్టేబుల్ కృష్ణంరాజు సిద్ధమయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కానిస్టేబుల్ కృష్ణంరాజు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి సస్పెండ్ చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال