దేశ వ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. హైదరాబాద్ మహానగరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందకు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. వైన్ షాపులు ఆగస్టు 15వ తేదీన మూతపడున్నాయి. బార్స్, పబ్స్, మందు సప్లై చేసే రెస్టారెంట్లు రేపు మూతపడున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలు కూడా డ్రై డే పాటించనున్నాయి.మాంసం దుకాణాలు బంద్
హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15, 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారిక ప్రకటన చేశారు. ఆగస్టు 15, 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్ అవ్వనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కావటంతో మాంసం షాపులు బంద్‌లో ఉంటాయి. మరుసటి రోజు.. అంటే ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణాష్టమి కావటంతో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
Tags
Hyderabad