బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనలో లారీ లోడు బీర్లని మట్టిపాలయ్యాయి.. కాటన్లలోని బీర్ సీసాలు పగిలి వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ సీన్ చూసిన మందుబాబులు అయ్యో అని గుండెలు బాదుకునేంత పనయ్యింది. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనలో లారీ లోడు బీర్లని మట్టిపాలయ్యాయి.. కాటన్లలోని బీర్ సీసాలు పగిలి వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ సీన్ చూసిన మందుబాబులు అయ్యో అని గుండెలు బాదుకునేంత పనయ్యింది. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమీపంలో జరిగింది. బీర్ సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కల్వర్టు ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోనే ఉన్న బీర్ సీసాలన్నీ పగిలి అందులోని లిక్కర్ అంత వరద నీటిలో కలిసిపోయింది..
ముల్కనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయల విలువ గల బీర్లు మొత్తం నేలపాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆ బీర్లు అన్ని కళ్ళ ముందే వర్షపు నీటిలో కలిసి ఏరులా పారుతుండడంతో మద్యం ప్రియులు అయ్యో అనుకున్నారు..! ఈ లారీ సంగారెడ్డి జిల్లాలోని డిస్టిలరీస్ నుండి హనుమకొండ జిల్లాలోని లిక్కర్ డిపోకు వెళ్తోంది. లారీ డ్రైవర్ అజాగ్రత్తతో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటన డ్రైవర్ క్లీనర్ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags
Hyderabad