రాముడి అక్షింతలు.... పూర్తి వివరాలు ఇవి తెలుసుకోండి

jayyapal jvs media
1 minute read

 విగ్రహ ప్రతిష్టాపన జరుగకుండానే...పూజలు చేయకుండానే అక్షతలు ఎలా వచ్చాయి అని చాలా మందికి సందేహం కలిగింది. చాలామంది ఇదే వారి సందేహమని అన్నారు. 



మనకు పంపిణీ చేస్తున్న అక్షింతలు విగ్రహ పూజకి సంబంధించినవి కావు. 

వాటిని అక్కడి పురోహితులు విజయ "అక్షతలు"అని వర్ణించారు. 

500 సంవత్సరాల పోరాటం తరువాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక, ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి, నిర్మాణం జరిగిన తరువాత, బాల రాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో, విజయ అక్షతలను బియ్యమూ,పసుపూ ఆవునెయ్యిలతో వేద మంత్రోచ్ఛారణ చేస్తూ కలిపి ఇంటింటికీ పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తరువాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షతలూ పూలూ చేతులలో పట్టుకుని ఆయన రాగానే వాటిని చల్లి.. ఆహ్వానం పలికారట.

అలాగే మరల అయోధ్య లో రాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ "విజయ అక్షతలు" మనం ఇంట్లో పూజకు వాడి శిరస్సున ధరించాలని ఉద్దేశ్యం. 

అక్షయమైనవి అక్షింతలు. క్షయము లేనివి, రామ రాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మనందరం విగ్రహ ప్రతిష్ఠ రోజున అయోధ్య దగ్గరలో ఉండి అక్షతలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షతలతో పూజ చేసుకుని వాటిని శిరస్సున ధరించవచ్చు. 

క్రింద పడితే తొక్కుతామనే సందేహం ఉంటే పూజలో వాడిన అక్షింతలని నైవేద్యం కోసం వాడుకోవచ్చు. 

ఈ విషయాలను వీడియోల ద్వారా పండితులు తెలియజేశారు. మాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవాలని రాశాము.




🙏🚩 జై శ్రీరామ జయ రామ జయ జయ రామ 🚩🙏

Tags
Chat