హోలీ పండుగ-2025 సందర్భంగా ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాలు.
14-03-2025 నాడు 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపు కోవలని ప్రజలను కోరాడడమైనది. ఇందుకు గాను ప్రజలు క్రింద ఇవ్వబడిన సూచనలు జరిచేయడమైనది.
✅ ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధించబడింది.
✅ ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేయడం తీవ్రంగా నేరంగా పరిగణించబడుతుంది.
✅ పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధం.
✅ ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలను సమూహాలుగా తరలించడం, వీధుల్లో అవాంఛిత రీతిలో తిరగడం అనుమతించబడదు.
✅ శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే ఏ చర్యైనా కఠినంగా ఎదుర్కొనబడుతుంది.
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
కావున, ప్రజలు పోలీసులకు సహకరించి, హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా పోలీసులు కోరుతున్నారు.