ఒక్కరోజులోనే బీచ్​పల్లి, అలంపూర్​ ఆలయాల దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!


 

అందుబాటు ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రతి శనివారం, ఆదివారం ప్యాకేజీ టూర్‌ వివరాలు చూస్తే: 

  • కింద్రాబాద్‌లోని యాత్రి నివాస్‌ నుంచి ఉదయం 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • సికింద్రాబాద్​ నుంచి బషీర్​బాగ్​ చేరుకుని ఉదయం 8.30గంటలకు జర్నీ మొదలవుతుంది.
  • మధ్యాహ్నం 12 గంటలలోపు బీచ్‌పల్లికి చేరుకుని, కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.
  • దర్శనం అనంతరం బీచ్​పల్లి నుంచి అలంపూర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత అలంపూర్‌ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే స్థానికంగా ఉన్న మరికొన్ని ఆలయాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం హరిత హోటల్లో భోజనం ఉంటుంది.
  • అలాగే సాయంత్రం 4 నుంచి 4.30 గంటలకు స్నాక్స్‌ హరిత హోటల్‌లో ఏర్పాటు చేస్తారు.
  • సాయంత్రం 4.30 గంటలకు అలంపూర్‌ నుంచి తిరిగి హైదరాబాద్‌కు రిటర్న్​ అవుతారు.
  • రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ పూర్తవుతుంది.


టికెట్ ధర ఎంతంటే ?

  • ఈ టూర్‌లో హైదరాబాద్‌ నుంచి నాన్‌ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది.
  • ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 టికెట్‌ ధరలు ఉన్నాయి.
  • అలాగే ఈ ప్యాకేజీలో ఫుడ్​ ఖర్చును ప్రయాణికులే భరించాలి.


Telangana Tourism Alampoor Temple Tour: జోగులాంబ - తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన జోగులాంబగా వెలసిందీ అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. ఇక సెలవు రోజుల్లో అయితే విపరీతమైన రద్దీ ఉంటుంది. మరి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ టూరిజం మీ కోసం సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టూరిజం హైదరాబాద్‌, బీచ్​పల్లి, అలంపూర్​ టెంపుల్స్​ పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఒక్క రోజులోనే ఈ టూర్‌ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బీచ్​పల్లిలోని ఆంజనేయ స్వామి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైన అలంపూర్‌ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

Follow Me