టీజీపీఎస్సీ గ్రూప్ 2 టాప్ 10 ర్యాంకర్లు వీరే..

 


నారు వెంక‌ట హ‌ర‌వ‌ర్ధన్ (ఓసీ) 447.088 ఫస్ట్‌ ర్యాంకు

వ‌డ్లకొండ స‌చిన్ (ఓసీ) 444.754 సెకండ్‌ ర్యాంకు

బీ మ‌నోహ‌ర్ రావు (బీసీ-డీ) 439.344 థార్డ్‌ ర్యాంకు

శ్రీరామ్ మ‌ధు (బీసీ-బీ) 438.972 ఫోర్త్ ర్యాంకు

చింత‌ప‌ల్లి ప్రీత‌మ్ రెడ్డి (ఓసీ) 431.102 ఫిఫ్త్‌ ర్యాంకు

అఖిల్ ఎర్ర (ఓసీ) 430.807 సిక్త్ ర్యాంకు

గొడ్డేటి అశోక్ (బీసీ-బీ) 425.842 సెవెంత్ ర్యాంకు

చిమ్ముల రాజ‌శేఖ‌ర్ (ఓసీ) 423.933 ఎయిథ్‌ ర్యాంకు

మేక‌ల ఉపేంద‌ర్ (బీసీ-డీ) 423.119 నైన్త్ ర్యాంకు

క‌రీంగు న‌రేశ్‌ (బీసీ-బీ) 422.989 టెన్త్ ర్యాం


హైదరాబాద్‌, మార్చి 7: తెలంగాణ గ్రూప్ 2 ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ మంగళవారం (మార్చి 11) మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి జ‌న‌ర‌ల్ ర్యాంకులను కమిషన్ ప్రకటించింది. మొత్తం 4 పేపర్లకు గ్రూప్ 2 పరీక్ష జరగగా.. ఫలితాలతోపాటు ఆన్సర్‌ కీలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక తాజా ఫలితాల్లో పురుష అభ్యర్థులు స‌త్తా చాటారు. ఈసారి టాప్ టెన్ ర్యాంకులన్నీ పురుషులవే కావడం విశేషం. ఏకంగా టాప్‌ 31వ ర్యాంకు వ‌ర‌కు అందరూ పురుష అభ్యర్థులే ఉన్నారు. నారు వెంక‌ట హ‌ర‌వ‌ర్ధన్ (ఓసీ) అనే అభ్యర్ధి 447.088 మార్కులతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వ‌డ్లకొండ స‌చిన్ (ఓసీ) అనే అభ్యర్ధి 444.754 మార్కులతో సెకండ్ ర్యాంకు, బీ మ‌నోహ‌ర్ రావు (బీసీ-డీ) అనే అభ్యర్ధి 439.344 మార్కులతో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇక ల‌క్కిరెడ్డి వినిషా రెడ్డి అనే మహిళా అభ్యర్ధికి 32వ ర్యాంకు వ‌రించింది. వినిషా రెడ్డికి 408 మార్కులు వ‌చ్చాయి. ఇక టాప్ టెన్ అభ్యర్థుల్లో ఐదుగురు ఓసీలు, మిగ‌తా ఐదుగురు బీసీ కేట‌గిరికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. టాప్ 50లో ఇద్దరు ఎస్టీలు మాత్రమే ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me