*
పీఎం శ్రీ పాఠశాల కార్యక్రమాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ బాదేపల్లి యందు మహబూబ్నగర్ డిఎస్పి, స్థానిక సీఐ , షీ టీం సభ్యులు, ప్రధానోపాధ్యాయులు ఏం చంద్రకళ ఆధ్వర్యంలో విద్యార్థినిలు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవడానికి పోలీసు వారి సహకారంతో బాల బాలికలకు ఉన్నటువంటి హక్కులు పరిరక్షించుకోవడానికి ఉన్నటువంటి చట్టాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినీలు పట్ల విద్యార్థులు కలిగి ఉండాల్సిన ప్రవర్తన గురించి వివరించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్, వివాహ వయసు, సోషల్ మీడియా, బాల కార్మిక వ్యవస్థ, మొదలగు అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.
ఇటి కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్పి మహబూబ్నగర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ సమ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. స్థానిక సీఐ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభ్యర్థన మేరకు ప్రతిరోజు పాఠశాల విడిచే సమయంలో శాంతి భద్రతల విషయంలో గాని, ట్రాఫిక్ విషయంలో గాని సహకారం అందించడానికి ఒక కానిస్టేబుల్ ను అందుబాటులో ఉంచుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం స్టాఫ్ సెక్రటరీ గోపాల్ ఉపాద్య సంఘాల నాయకులు సునీల్ కుమార్, యుగంధర్ ,శంకర్ బాబు ఉపాధ్యాయునీలు శశిరేఖ, భాగ్యమ్మ ,హేమలత, పుష్పలత, స్వర్ణలత, శ్రీదేవి, శ్రీలత, ప్రియాంక, గాయత్రి, ప్రమీల, నిర్మల, సుజాత, కృష్ణవేణి, తదితరులు Interesting
*బాయ్స్ బాదేపల్లి పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం*
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ బాదేపల్లి యందు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశము యొక్క వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను పరిచయం చేస్తూ వాటిని పెంపొందించే విధంగా అవగాహన కల్పిస్తూ ఆయా రాష్ట్రాల యొక్క వేషాధారణ పండుగలు వారి యొక్క ఆహారపు అలవాట్లు వారి లిపి భాషను వివరిస్తూ నాటికలను వేషాధరణచె విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి భాషను వారి యొక్క వేషాధారణను అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాలను వివరిస్తూ విద్యార్థులు రోల్ మోడల్ ప్రదర్శించారు ఆ రాష్ట్రం యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రకళ అధ్యక్షత వహించారు ఇతర ఉపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం గోపాల్ సునీల్ శంకర్ యుగంధర్ హేమలత శశిరేఖ భాగ్యమ్మ పుష్పలత కృష్ణవేణి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు