Telangana Assembly: తగ్గేదేలే.. ఇవ్వాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనున్నారు. వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈనెల 15 నుంచి 18వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరనున్నాయి..

 అసెంబ్లీ సమావేశాలు.. ఇలా..

మార్చి 12: తొలి రోజు శాసనసభ, మండలి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు..

అంతేకాకుండా నేడు BAC సమావేశం జరగనుంది. సభను ఎంతకాలం నిర్వహించాలనేది B.A.C భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

మార్చి 13: గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.

మార్చి 14: హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు

మార్చి 15-18: కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ.

మార్చి 18 లేదా 19 2025-26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.

మార్చి 27 లేదా 28 అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం.

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ( మార్చి 12) ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికారపక్షం బరిలోకి దిగుతుండగా.. ప్రజాసమస్యలపై గొంత్తెత్తాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది.. ఇక బీజేపీ సూపర్‌ సిక్స్‌పై అస్త్రాలను రెడీ చేసుకుంటోంది.. ఇలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనున్నారు. వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈనెల 15 నుంచి 18వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరనున్నాయి.. కాగా.. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరుకానున్నారు.. ఇప్పటికే.. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు.. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సభలో అనుసరించే వ్యూహాలను రచించనున్నారు. ప్రధాన అంశాలపై కీలక చర్చ..

కృష్ణా జలాల హక్కు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతుభరోసా, స్థానిక సంస్థల నిధుల లేమి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి..


ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి అఖిలపక్షం..

దేశంలో తొలిసారి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ప్రస్తుత రేవంత్ సర్కార్ సభలో గట్టిగా వాదించనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సభను మధ్యలో వాయిదా వేసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me