.
*అక్రమ బెట్టింగ్ & గేమింగ్ యాప్స్ పై పోలీసుల కఠిన చర్యలు – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ హెచ్చరిక*
మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్న వారి పై కఠిన చర్యలు తప్పవని *జిల్లా ఎస్పీ . జానకి, ఐపీఎస్* హెచ్చరించారు. ఇటీవల యువత, విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆకాంక్షతో ఈ బెట్టింగ్ యాప్స్ లో పాల్గొనడం, అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురవడం, చివరికి ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించి, అక్రమ బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
అక్రమ బెట్టింగ్ యాప్స్ లో పాల్గొన్నా, గేమింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవు.
సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రచారం చేసే ఇన్ఫ్లుఎన్సర్లపై కేసులు నమోదు చేయబడతాయి.
అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.
అక్రమ యాప్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ సంద్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు. ఇది వారి జీవితాలను నాశనం చేసే ప్రమాదం ఉంది" అని తెలిపారు.
అక్రమ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
గేమింగ్ యాప్స్ ద్వారా ప్రమాదకర మాల్వేర్, ఫేక్ లింక్స్ ద్వారా వ్యక్తిగత అకౌంట్ వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
ఈ బెట్టింగ్ యాప్స్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి.
జిల్లా ప్రజలకు, యువతకు ఒక విజ్ఞప్తి. మీ చుట్టూ ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.
100 డయల్ చేయండి లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
జిల్లా ప్రజల సహకారంతో, యువత ఆత్మహత్యల వంటి దురదృష్టకర సంఘటనలు జరుగకుండా కాపాడడమే మా లక్ష్యం. "అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు స్వస్తి చెప్పండి – మీ భవిష్యత్తును సురక్షి
తంగా కాపాడుకోండి!"