CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులకు తిప్పలు పడుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి..

 

తెలంగాణకే ఆదర్శంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. 

జనగామ: తెలంగాణకే ఆదర్శంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రాంతం వరంగల్‌ అని, వరంగల్‌‌కు ఎయిర్‌పోర్టును కూడా సాధించుకున్నామని అన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం శివునిపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.5,500 కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.20,617 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని, ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నామని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me