మద్యం తాగి అపవిత్రం చేశారు : కాంగ్రెస్
పిలిచి అవమానించారు: బీఆర్‌ఎస్
మహబూబ్‌నగర్ : పాలమూరు పట్టణంలో గురువారం రాత్రి యాద వ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహంచిన సదర్ ఉత్సవాలకు రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సదర్ వేడుకల్లో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్న సంగతి విధితమే. వేడుకల్లో జరిగిన తప్పిదాలపై శుక్రవా రం రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మూడా చైర్మ న్ లక్ష్మణ్‌యాదవ్ మాట్లాడుతూ సదర్ వేడుకల కు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మాజీ మం త్రి శ్రీనివాస్ గౌడ్‌ను కుడా ఆహ్వానించామన్నారు. ఆయన తన అనుచరులతో వచ్చి వేడుకలకు అంతరాయం కలిగించారని ఆరోపించారు. మాజీ మంత్రితో పాటు తన అనుచరులంతా మద్యం మత్తులో వచ్చి ఎంతో పవిత్రంగా సాగుతున్న వేడుకలను అపవిత్రం చేశారని అన్నారు. యాద వుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ఈ చర్య లను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆదరణను జీర్ణించుకోలేక ఆరోపణలు
కాగా ఇదే అంశంపై శుక్రవారం జిల్లా కేంద్రం లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ యాదవ సం ఘం నాయకులు సాయిలుయాదవ్, శివయాదవ్ మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకలకు ఆహ్వానించి వేదిక మీద కనీసం కుర్చీ కూడా వేయలేదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ ఉత్సవాల వద్దకు చేరుకోగానే ఆయన అభిమానులు ఉత్సా హంతో ఆయనను భుజాలపై ఎత్తుకుని ఆయన కు జేజేలు పలికారన్నారు. ఆయనకు ఉన్న ఆదర ణను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి ప్రతిష్టను దిగజార్చేందు కోసం మద్యం తాగి ఉత్సవాలకు వచ్చారని ఊహాజనిత ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదని అన్నా రు. మాజీమంత్రి ఉదయం నుంచి పలు కార్యక్ర మాల్లో పాల్గొన్నారని, ఆయన వెంట తామంతా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న చౌకబా రు విమర్శలను ప్రజలు గమని స్తున్నారని, రాను న్న రోజుల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.