
అమిత్ షా మార్పింగ్ వీడియో కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీ పీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ ఏ1, మన్నె సతీష్ ఏ2, నవీన్ఏ3, ఆస్మా తస్లీమ్ ఏ4, గీత ఏ5లను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో ఇవాళ బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు.. కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రెండు 10 వేల షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతీ సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఏప్రిల్ 23న సిద్దిపేటలో బహిరంగ సభలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి టీపీసీసీ మీడియా టీంపై ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
from V6 Velugu https://ift.tt/FepfJ3x
via IFTTT