పదవీ విరమణ పొందుతున్న భవనయ్య, SIని సన్మానించింన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపిఎస్

 శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ........ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ అన్నారు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో పనిచేసి ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న భవనయ్య, SI ని సన్మానించింన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపిఎస్ 


ఎస్ఐ, భవనయ్య, 1984 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై  41 సంవత్సరాల సర్విస్ భవనయ్య ఎస్సై పోలీసు శాఖ లో అమూల్యమైన సేవలు అందించి ఈరోజు  పదవి విరమణ సందర్భంగా ఎస్పీ  కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పదవి విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను  పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఏ.ఎస్.ఐగా,  ఎస్.ఐగా పదోన్నతి పొంది సుధీర్ఘకాలంగా విధులు  నిర్వహించడం మరువమని, పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ప్రజా  రక్షణ కోసం వీరు  పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పీఅన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని  సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి  రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మీకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో  ఏవో రుక్మిణి భాయ్, ఆర్ ఐ కృష్ణయ్య మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال