ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిగిలిన మ్యాచ్‌ల్లో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిగిలిన మ్యాచ్‌ల్లో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ మోచేతికి గాయం కావడంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాగా, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఫేలవంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన సీఎస్‌కే.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరి ఇప్పుడు ధోని కెప్టెన్సీ తీసుకున్న తర్వాత అయినా సీఎస్‌కే జాతకం మారుతుందో లేదో చూడాలి. అయితే.. ఉన్నపళంగా రుతురాజ్ గాయపడటం కూడా అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇలాగే రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి.. సీఎస్‌కే వరుసగా ఓడిపోతున్న క్రమంలో అతన్ని తప్పించి.. మళ్లీ ధోనినే కెప్టెన్సీ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండటంతో.. సేమ్ సీన్ రిపీట్ అయిందా? నిజంగానే రుతురాజ్ గాయపడ్డాడా? లేదా అతన్ని బలవంతంగా తప్పించారా? అనే డౌట్స్ క్రికెట్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.