సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు*


*


జిల్లా ఎస్పీ  డి. జానకి, ఐపీఎస్  సూచనల మేరకు, దేవరకద్ర అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు, మహబూబ్ నగర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, CCS ఇన్స్పెక్టర్ రత్నం, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ లతో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ బృందం భూత్పూర్ మండల పరిధిలోని క్రింద పేర్కొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది:


1.మా అగ్రి బయోటెక్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, పోతులమడుగు

2.సికోస్‌ప్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, భూత్పూర్

3.సుదివ్య సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, భూత్పూర్

4.ఆద్యా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూత్పూర్

5.సాయి తేజ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, పోతులమడుగు

ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు  మాట్లాడుతూ, “రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో ఎలాంటి అలసత్వం చోటు చేసుకోరాదు. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా సీడ్ ప్రాసెసింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు. విత్తన శుద్ధి, ప్యాకింగ్, గోదాముల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి సమీక్ష జరిపామని తెలిపారు.



Previous Post Next Post

Education

  1. TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...? - New!
  2. TGSRJC : టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి - New!

نموذج الاتصال