*
ఒడిశా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ టెన్ని కాయిట్ పోటీలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు హన్మకొండ లో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ టెన్ని కాయిట్ పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు యాసిన్, సుజాయిత్, మమత, జాష్నవి, శ్రీనిధి లు ప్రతిభను చాటి జాతీయ స్థాయి సీనియర్ టెన్ని కాయిట్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 25 నుంచి 29 వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో జరిగే సీనియర్ టెన్ని కాయిట్ పోటీలలో జిల్లా క్రీడా కారులు పాల్గొనేందుకు మహబూబ్ నగర్ నుంచి ఆదివారం బయలు దేరి వెళ్లారు. జాతీయ స్థాయి సీనియర్ టెన్ని కాయిట్ పోటీలకు ఎంపికైన సదరు క్రీడాకారులను జిల్లా టెన్ని కాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్ డాక్టర్ అంబటి నటరాజ్, ప్రధాన కార్యదర్శి వడెన్న, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ లు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి టెన్ని కాయిట్ పోటీల్లో ప్రతిభను చాటి జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఆశీర్వదించారు.