BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధి నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. 

కరీంనగర్ జిల్లా:

 రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీ (MLC)ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) సంచలన నిర్ణయం (Sensational Decision) తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నా అభ్యర్థిని గులాబీ బాస్ ఇంతవరకు ప్రకటించలేదు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. నేతలకు కేసీఆర్ (KCR) గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పార్టీలో చేరి పోటీ చేద్దామనుకున్న ప్రసన్న హరికృష్ణకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కాగా మాజీ మేయర్ రవీందర్‌కు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. గతంలో కూడా ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని నెలబెట్టలేదు. కొందరు ఆశవహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు తెలియవచ్చింది. కాగా మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్‌రూం, బ్యాలట్‌ బాక్స్‌ల నిర్వహణ తదితర ఏర్పాట్లను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలోని ఇండోర్‌ స్టేడియంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటుపై పోలీసు అధికారులతో చర్చించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం బ్యాలెట్‌ బాక్స్‌లు ఉపయోగించనున్న నేపథ్యంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్స్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. బ్యాలెట్‌ బాక్స్‌లకు ఆయిల్‌ లూబ్రికేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓలు మహేశ్వర్‌, రమేష్‌, ఏవో సుధాకర్‌ పాల్గొన్నారు.


అధికారుల సెలవు దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్‌

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సెలవు దరఖాస్తు, మంజూరును ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. టీం ఇండియా సంస్థ సీఈవో చైతన్య ఆధ్వర్యంలో ఈ లీవ్‌ మేనేజిమెంట్‌ పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేపర్‌ వర్క్‌ తగ్గించేందుకు, సెలవు మంజూరులో పారదర్శకత కోసం ఈ పోర్టల్‌ రూపొందించామన్నారు. అధికారులు, ఉద్యోగులు సెలవు కోసం ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేస్తే జిల్లా యంత్రాంగం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రంజిత్‌రెడ్డి, లక్ష్మిప్రసన్న, అనిల్‌శర్మ పాల్గొన్నారు.

Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!
  2. TGRJC CET Notification 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - 'టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌' ప్రకటన విడుదల - దరఖాస్తు తేదీలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అయ్యప్ప

  1. అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్ l Ayyappa Swamy Bhajana Songs Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me