దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), చౌక ధరలో నానో కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కారుగా నిలిచిన టాటా నానో, ఇప్పుడు సరికొత్త అవతారంలో ఎలక్ట్రిక్ వెహికల్‌గా మళ్లీ రిలీజ్ అవుతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టాటా నానో ఈవీ (EV) త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తా సంస్థలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు, పనితీరు, ధర వివరాలు చూద్దాం.
ఫీచర్లు
నివేదికల ప్రకారం, టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రిలీజ్ అవ్వనుంది. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే ఈ సిస్టమ్‌తో పాటు బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో ప్రయాణికులకు మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించనుందట.
మరిన్ని ఫీచర్లు
డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచేందుకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ నానోలో ఉండొచ్చని తెలుస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో ఈ కారు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. పర్ఫామెన్స్
టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ 17 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పాటు 40 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుందని సమాచారం. ఇది ఆ రేంజ్‌కి బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ నుంచి 400 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. సిటీ డ్రైవింగ్‌కి అనుకూలంగా దీని టాప్ స్పీడ్ గంటకు 60-70 కి.మీ మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.
రూమర్స్ ప్రకారం, టాటా నానో EV హోమ్ ఛార్జింగ్‌తో 4-6 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది, ఇందులో నలుగురు కూర్చోవచ్చు. తక్కువ పార్టులు ఉండటంతో మెయింటెనెన్స్ తక్కువ, బ్రేక్‌డౌన్స్ టెన్షన్ కూడా ఉండదు. గవర్నమెంట్ సబ్సిడీలతో మరింత తక్కువ ధరకే రావచ్చు. సిటీ డ్రైవింగ్‌కే ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. ఈ వెహికల్ ఇండియన్ మార్కెట్లో MG కామెట్, టియాగో EV లతో పోటీ పడుతుంది. ధరఎంత?
టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ వేరియంట్, ఫీచర్లను బట్టి రూ.2.30 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా జరిగితే, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో ఇది ఒక చీపెస్ట్ కార్ అవుతుంది. ఈ కారు 2025 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, టాటా మోటార్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.