స్థానిక మహబూబ్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో(తక్షశిల పాఠశాల) విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ముందస్తు సంక్రాంతి సంబరాలు రంగవల్లులతో, హరిదాసు వేషాలతో, గంగిరెద్దులు, కోడిపందాలతో, భోగిమంటలతో సాంప్రదాయ వస్త్రాలంకరణతో గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఎంతో కోలాహలంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముష్కర మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే విద్యార్థులకు బాల్య దశలోనే తెలుగు ప్రజల పండుగల విశిష్టతలను తెలియజేయుటకు ఇలాంటి ముందస్తు పండగలను విద్యార్థులను స్వయంగా పాల్గొనేటట్లు చేసి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, విలువలను ముందు తరాలకు అందించే విధంగా శ్రీ చైతన్య యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు.ఉపాధ్యాయులందరూ, విద్యార్థులతో కలిసి సంక్రాంతి లక్ష్మికి పూజలు చేసి, భోగి మంటలు, భోగిపళ్ళతో చిన్నారులకి సంక్రాంతి లక్ష్మి దీవెనలు అందజేసి, అనంతరం విద్యార్థులు అందరూ గాలిపటాలు ఎగురవేసి కేరింతలు కొట్టారు, అదేవిధంగా పండగ విశిష్టతను దాని ప్రాముఖ్యతను తెలియజేసే పాటల తో సాంప్రదాయ నృత్యాలు చేసి ఆనందంగా పండగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ , డైరెక్టర్ శ్రీవిద్య మేడం , ఎజీఎం భాస్కర్ రెడ్డి , కోఆర్డినేటర్ రఘు సార్ , డీన్ ,ఇన్చార్జులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిఈటిలు మరియు తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రిన్సిపల్
ముష్కర మనోహర్,
శ్రీ చైతన్య టెక్నో స్కూల్ (తక్షశిల పాఠశాల),
మహబూబ్ నగర్,