యాదాద్రీశుడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై అన్ని రికార్డుల్లో మార్చాల్సిందే!
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు.
- యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం ఆదేశాలు
- టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలన్న సీఎం
- గోసంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచన
యాదాద్రిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ తరహాలో ఈ బోర్డు ఉండేలా చూడాలన్నారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. గోసంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కొండపై భక్తులు ఇబ్బందులు లేకుండా నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ చేయాలన్నారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
మూసీ పునరుద్ధరణ పాదయాత్ర కోసం ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం... లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వైటీడీఏ అధికారులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి వెళ్లిన సీఎం, విష్ణు పుష్కరిణి వద్ద నీళ్లను తలపై చల్లుకుని స్నాన సంకల్పం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధనను ముందుగా దర్శించుకున్నారు. దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆ తర్వాత వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం పర్యటన కోసం 2వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
Tags
News@jcl