బహిరంగ ప్రదేశాల్లో నిషేధిత వ్యర్థాలు డంపు చేస్తున్న కంపెనీలు
విషం చిమ్ముతున్న ఫ్యాక్టరీలు.....చోద్యం చూస్తున్న అధికారులు
పరిస్థితి ఇలాగే కొనసాగితే విషతుల్యంగా మారిన భూగర్భ జలం
జడ్చర్ల వాసులను కాపాడేది ఎవరు
: జడ్చర్ల వాసుల మేలుకోకుంటే వాయు కాలుష్యం చెత్త కాలుష్యం భూగర్భ జల కాలుష్యంతో విషతుల్యంలో బతకాల్సిందే?
విషం చిమ్ముతున్న ఫ్యాక్టరీలు...
వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం కెమికల్ నీరును భూమిలోకి వదిలి పంటలు పండే భూములు కాలుష్యం.. ఇప్పుడు అవి కాక సేజ్ లోపల ఉన్న పరిశ్రమలు పరిశ్రమల లోపల వాడిన వ్యర్థా పదార్థాలను తీసుకొచ్చి లెదర్ పార్క్ వెనకాల ఉన్న బావిలో వేసి అంటి పెడుతున్నారు.
అడిగే వారెవరు లేడు లేకపోవడంతో కంపెనీలు తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నాయి.
పారిశ్రామిక వాడలో ఉన్న పలు ఫ్యాక్టరీలు తమ కంపెనీలో వాడిన మెడికల్ వేస్ట్ లు కెమికల్ బ్యాగులు, బ్లేడ్లు ఇతర సామాగ్రిని తీసుకొచ్చి బావిలో వేసి అంటి పెడుతున్నారు.
పోలేపల్లి గ్రామపంచాయతీలో గత నాలుగు రోజుల నుండి లోకాయుక్త పర్యవేక్షణలో నీటి డంపింగ్ స్థావరాల విధ్వంసం జరుగుతూనే ఉంది ఒకవైపు చెరువు పక్కలో ఉన్న కంపెనీల అక్రమ నీటి దందా నిరంతరం కొనసాగుతూనే ఉంది ఇది కాకుండా పరిశ్రమలు పారిశ్రామిక వాడని పూర్తిగా కాలుష్యం మాయం చేయడానికి కంకణ కట్టుకున్నాయి.