హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న ఐ-బొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని (ibomma owner immadi ravi) అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడు కూకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐ-బొమ్మ వెబ్సైట్, సర్వర్ నుంచి సమాచారం సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను హోల్డ్ చేసినట్టు సమాచారం.
పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ. వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఐ-బొమ్మ (ibomma telugu movies) కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరి కొన్ని రోజుల్లో ఆ వెబ్సైట్ను కూడా క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. పైరసీ (piracy movie websites) నిర్వాకం మొత్తం ఇతను ఒక్కడే చేస్తున్నాడా? ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ. వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఐ-బొమ్మ (ibomma telugu movies) కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరి కొన్ని రోజుల్లో ఆ వెబ్సైట్ను కూడా క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. పైరసి
(3 ລ້ (ibomma telugu movies new) చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు (cyber crime police) వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్లో నిందితులను అరెస్ట్ చేశారు.