రూ.2 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి


 

రంగారెడ్డి డీఎంహెచ్‌వో ఏసీబీకి చిక్కారు
ఏసీబీ ఛాపా

రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు!

రంగారెడ్డి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుపడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది.

ఆ రూ.2 లక్షల్లో భాగంగా ముందుగా రూ.లక్ష ఇవ్వాలని స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిఘా ఏర్పాటు చేశారు.

బాధితుడు రూ.లక్షను హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం శ్రీనివాస్ ఆ నగదును డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆ డబ్బులు కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో లంచం డిమాండ్‌కు సంబంధించిన పక్కా ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. లంచం డిమాండ్ చేయడం, నగదు తీసుకోవడం వంటి వ్యవహారంలో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య పాత్రపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

తాజా నవీకరణ: ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow