ATM Robbery: నగరంలో భారీ చోరీ.. ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు


 

హైదరాబాద్‌ నగంరలో భారీ చోరీ వెలుగు చూసింది. శంషాబాద్‌ పీఎస్‌ పరిధిలోని శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు.. ఏటీఎం బద్దల కొట్టి ఏకంగా రూ.30లక్షలు కాజేశారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ చోరీ కలకలం రేపింది. శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ ఏటీఎంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి, అందులోని రూ. 30 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow