Weather: ఎంత చల్లటి కబురు చెప్పారండీ.. ఏపీ, తెలంగాణకు వచ్చే 3 రోజులు వానలే వానలు
మండిపోతున్న ఎండల నుంచి ఇక కాస్త ఉపశమనం. ఇవ్వాళ్టి నుంచి మూడు రోజులు పాటు తెలంగాణలో వానలు దంచికొడుతాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఏపీకి కూడా చల్లని కబురు అందింది. దక్షిణ ఛత్తీస్‌గడ్ నుండి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో..
నిజామాబాద్..40.4 డిగ్రీలు
మెదక్..40.2 డిగ్రీలు
భద్రాచలం..39.8 డిగ్రీలు
రామగుండం..38.8 డిగ్రీలు
మహబూబ్ నగర్..38.6 డిగ్రీలు
హైదరాబాద్..38.5 డిగ్రీలు
ఖమ్మం..38.4 డిగ్రీలు
నల్లగొండ..38 డిగ్రీలు
హనుమకొండ..37.5 డిగ్రీలు
మరోవైపు మంగళవారం ఏపీలోని 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. రేపు(బుధవారం) 28 మండలాల్లో వడగాలులు వీచేందుకు ఛాన్స్ ఉంది.
ఎల్లుండి(గురువారం) రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నిన్న(సోమవారం) నంద్యాల(D) గోస్పాడులో 40.3°C, కర్నూలు(D) కమ్మరచేడులో 40.2°C, అనంతపురం(D) నాగసముద్రంలో 40°C, వైఎస్సార్(D) గోటూరులో 39.9°C, అనకాపల్లి(D) రావికమతంలో 39.7°C, మన్యం(D) జియ్యమ్మవలసలో 39.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరత్వాడ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ(మంగళవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుండి వచ్చే నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఇవాళ(ఏప్రిల్ 1) గరిష్టంగా నిజామాబాద్ లో 41.2 కనిష్టంగా హనుమకొండ లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న(సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, రామగుండం, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.