30 మార్చి 2025 ఛైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఏర్పడిందని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో రాశుల వారీగా ఈ కింది విధంగా ఉన్నాయని చిలకమర్తి తెలియజేశారు.
2025-26 హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదివారం నుంచి శ్రీ ‘విశ్వవాసు’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో మిథునరాశి వారికి వ్యాపారం, విద్యా, ఆదాయం, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు. ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి, ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యా పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మిథున రాశి అధిపతి - బుధుడు
* రాశి నామ అక్షరాలు - క, కి, కు, ఘ, ఛ, కే, కో, హ
* శ్రీ వినాయకుడికి ఆరాధించాలి.
* లక్కీ కలర్ - గ్రీన్(ఆకుపచ్చ)
* మిథునరాశి అనుకూల రోజులు : బుధ, శుక్ర, శనివారాలు