ఇది ఈ డైలాగు మీలో చాలామందికి తెలిసినా కూడా పూర్తిగా చదవండి...ఆ తరువాత చివర్లో వచ్చే కొందరి అంతర్ మదన అభిప్రాయాలు మీకే తెలుస్తాయి.
"పాంచాలీ... పంచభర్తృకా,.... ఏమే.... ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము..
ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయశల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటముల వ్రయ్యలు చేయుచున్నవే.
అహో...
క్షీరావారాశి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్య ధౌరేయుండనై, నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై, పరమేశ్వరపాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్నుచూచి...
ఒక్క ఆడది
పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా....
అహో !..
తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ బంధకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?.....
హ..ఔనులే!..
ఆ బయసిమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వత్సరపర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున
హఁ.... హఁ.... నేనేల కటకట పడవలె?
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా...
అని సరిపెట్టుకుందునా?
హఁ
ఈ లోకము ముయ్య మూకుడుండునా.!?
అయిననూ....
దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె??
వచ్చితిమిఫో......! దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృ సంశోభితమైన ఆ #మయసభా భవనము #మాకేలవిడిదికావలె?
అయినది ఫో...
అందు చిత్రచిత్రిత విచిత్ర లావణ్యలహరులలో ఈదులాడు #జిఘృక్షాపేక్ష
అహ్హా... మాకేల కలుగవలే?
కలిగినది ఫో..
సజీవ జలచర సంతాన వితానములకాలావాలమగు ఆ జలాశయమున మేమేల #కాలుమోపవలె?
మోపితిమిఫో...
సకల రాజన్య కోటీరకోటీ తటోత్క్షిప్త రత్నప్రభా నీరాజితమగు మా పాదపద్మమేల అపభ్రంశమందవలె? ఏ తత్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె?
వీక్షించవలె? పరిహసించవలె?.
హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ....హతవిధి.
ఆజన్మశత్రువులేయని #అనుమానించుచునే యరుదెంచిన #మమ్ము అవమాన బడబానల జ్వాలలు #దగ్ధమొనర్చుచున్నవి మామా....
విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభవాధిక్యములేమైనవి మామా??
పాంచాలీ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై... మర్యాదాతిక్రమణముగా #మనుటయా...?
పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....?
ఇస్సీ...
ఆడుదానిపై పగ సాధింపలేక అస్పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా?..
ఇపుడేదీ కర్తవ్యము? మనుటయా?..
మరణించుటయా??.. ఏదీ కర్తవ్యము????
ఇలాంటి లోలోపలి (as it is గా కాకున్నా)అంతర్ మధన భావాలు మొన్నటి విజయవాడలో VHP పెద్దయెత్తున నిర్వహించిన #హైందవశంఖారావానికి హాజరైన #అతికొందరి ముఖ్యుల భావావేశాలు అని కొందరి అభిప్రాయం.
సభావేధికపై చోటు దక్కక
కనీసం మైక్ లో మాట్లాడే ఛాన్స్ దక్కక
వచ్చిన హిందూ బంధువులరిని కలవలేక,పలకరించలేక
వెంట తీసుకెళదామంటే సొంతవారికే రవాణా ఖర్చులు పెట్టుకోలేక
తమకు మాత్రమే VIP pass లు రాగానే..వెళ్లి గ్యాలరీ ల్లో బంధీలై ,
బయిటికి చెప్పుకోలేని ప్రముఖుల భాధలు.
మేము వెళ్ళాక పోతే ఎలా?? అని బయిటికి చెప్పినా
ఎందుకెళ్ళాంరా బాబూ..ఎవ్వడూ #కాననేలేదూ అని లోలోపలి రోదనలు..హాహా కారాలు..
సొంత సైన్యాన్ని కూడా చూపుకోలేని ఆందోళనలు...
ఇది అక్కడికొచ్చిన మెజారిటీ అందరూ #కాదు
కేవలం
ఓ 5% మంది తోపులు,తురుముల ఆక్రందనలు మాత్రమే అనుకుంటున్నా...
తప్పుగా చెప్పి ఉంటే మన్నింపుడి..
శుభ సాయంత్రం..మీ రవీందర్ గజవెళ్లి !!