ఈఎస్ఐలో అటెండర్లే వైద్యులు
ఉన్న వైద్యాధికారి బదిలి—వచ్చిన వైద్యుడు సెలవులో
జడ్చర్లలో |ఈఎస్ఐ డిస్పెన్సరీకి సుస్థి
జడ్చర్ల ఈఎస్ఐ హస్పిటల్లో అటెండర్లే డాక్టర్లు కూలినాలి చేసుకుని సుస్థిచేస్తే ఈఎస్ఐ కార్డు ఉందని జడ్చర్ల ఈఎస్ఐ హాస్పిటల్కు పోతే అక్కడ అటెండర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నరు. గదేంది డాక్టర్లు కద ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అనుకుంటున్నార అవును నేను గట్లనే అనుకుని ఆడికి పోయినాంక చూస్తే ఇంకేముందు అటెండర్ అన్ననే మందులిస్తున్నడు. గిదేందిబై మీరు మందులిస్తున్నరని అడిగితే డాక్టర్లు లేరన్న వచ్చినోళ్లను ఉత్తగ పంపలేము కదా. అందుకే మందులిస్తున్న అని చెప్పిండు. గా కథేందో ఓ సారి చూద్దాం పదండి. జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలలో ఉన్న కార్మికులకు వైద్య సేవలు ఇచ్చేందుకు ఈఎస్ఐ డిస్పెస్సరి పెట్టిండ్రు. గా డిస్పెన్సరీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లేమో నిన్నమొన్న జరిగిన ట్రాన్స్ఫర్లలో ఇంకోచోటకు పోయిండ్రు. మళ్ల గాళ్ల స్థానంలో ఇద్దరు డాక్టర్లు ఈడకు రావాల్సి ఉండే. ఏమైందో తెల్వదు కాని ఒక్క డాక్టరే వచ్చిండి. వచ్చినాయన ఊరుకుంటడ 5 రోజులు సెలవుపెట్టి పోయిండు. డాక్టర్లు లేకపోతేనేం స్టాఫ్ నర్సు ఉండాలనుకుంటున్నరగా బదిలీలలో గా స్టాఫ్ నర్సు కూడ పోయింది. మరి ఫార్మసిస్ట్ ఉంటడసుకుంటున్నర గా పోస్టు ఎప్పటినుంచో ఖాళి ఉంది. అందుకే గా అటెండర్ అన్ననే వచ్చినోళ్లకు మందులిస్తున్నడు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు స్పందించి డాక్టర్లను, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ను పంపిస్తే బాగుంటదని కార్మికులు కోరుతున్నరు.|