*బోనాల మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు – పాతపాలమూరు పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ *
మహబూబ్ నగర్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాతపాలమూరు లోని పోచమ్మ (శీతలాదేవి) దేవాలయంలో బోనాల మహోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి డి.జానకి, ఐపీఎస్ దేవాలయా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను , బందోబస్తును పరిశీలించి, పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక పోలీసు అధికారులకు మరియు ఆలయ కమిటీ వారికి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ —
"బోనాల మహోత్సవం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే ఈ ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు చొరవతో సమన్వయంగా పని చేసి, భద్రత పరంగా ఎలాంటి లోపం చోటు చేసుకోకుండా చూడాలని ట్రాఫిక్ నియంత్రణ, మహిళ భద్రత, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు, కమిటీ సభ్యులకు సూచనలు చేశారు.
ఆలయ పరిసరాల్లో నిఘా పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
భక్తులు నిస్సంకోచంగా పండుగలో పాల్గొనే విధంగా పోలీసు శాఖ తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తె
లిపారు.