*పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు 10000/- నగదు జరిమానా.*
2016లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈరోజు అనగా 17.07.2025న మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు (RAPE & POCSO COURT) లో విచారణ పూర్తయి, నిందితుడైన జిలకరపురం కృష్ణయ్య (వయస్సు 35), r/o గడిదిర్యాల్ గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్, కు జీవిత ఖైదు (Rigorous Imprisonment for Life) మరియు రూ. 10,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.
ఈ కేసు Mahammadabad Police Station పరిధిలో 2016 ఆగస్టులో Cr.No. 106/2016 U/S 376(2)(n) IPC & Sec 3 r/w 4 of POCSO Act ప్రకారం నమోదు చేయబడినది. అప్పటి దర్యాప్తు అధికారుల కృషి, న్యాయవాదుల పట్టుదలతో న్యాయవ్యవస్థ ద్వారా బాధితురాలికి న్యాయం లభించడం జరిగింది.
*ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు:*
గాయిబప్పా, HC 2042, PS మహమ్మదాబాద్
జె. ఉపేంద్ర, అప్పటి సీఐ, చెవెల్ల/పరిగి సర్కిల్
బి. కిషన్, అప్పటి సీఐ, మహబూబ్‌నగర్ రూరల్ (ప్రస్తుత SDPO, చెవెల్ల)
ప్రభుత్వ న్యాయవాదులు:
బలస్వామి, Addl. Public Prosecutor, మహిళా కోర్టు / POCSO కోర్టు
M. జాన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, Rape & POCSO Court, మహబూబ్‌నగర్
ప్రస్తుత పోలీసు అధికారులు:
బి. గాంధినాయక్, CI, మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్
శేకర్ రెడ్డి, SI, SHO, PS మహమ్మదాబాద్
బాలకృష్ణ, ASI, కోర్టు లైసెన్స్ అధికారి
*కోర్టు డ్యూటీ అధికారులు:*
1.కృష్ణా, PC 3666, సెషన్స్ కోర్ట్
2.రహీమ్, PC 2769
3.శంకర్, PC 2194
ఈ కేసులో న్యాయ న్యాయ విచారణ కొనసాగించి బాధితునికి న్యాయం అందించేందుకు కృషి చేసిన న్యాయస్థాన అధికారులకు, పోలీసు అధికారులకు జిల్లా SP డి. జానకి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.