🚨 పోలేపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్లాస్టిక్ దహనం | ప్రజల ఆరోగ్యంపై ముప్పు

 🚨 “పోలేపల్లి SEZ కాదు… ఇది Pollution Palli Search!” 🌫️🔥



తెలంగాణలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా పేరొందిన పోలేపల్లి ప్రాంతం… ఇప్పుడు కాలుష్య కేంద్రంగా మారిందా..? జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి, మాచారం, ముదిరెడ్డిపల్లి, రాజాపూర్ గ్రామాల మధ్య కొనసాగుతున్న పరిశ్రమల కార్యకలాపాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఒకప్పుడు “ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్”గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం… తెలంగాణ ఏర్పాటుకు తర్వాత “తెలంగాణ స్టేట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్”గా మారింది. కానీ పేరు మాత్రమే గ్రీన్… పరిస్థితులు మాత్రం రెడ్ జోన్‌ను తలపిస్తున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

🌫️ కాలుష్యంతో నిండిన గాలి…
ప్రతిరోజూ పరిశ్రమల పరిసరాల్లో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేసి తగలబెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, ఫైబర్ వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగ వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

🔥 చెత్త దహనం… కాలిపోతున్న చెట్లు
ఇంతకుముందు పరిశ్రమల చెత్తను లెదర్ ఇండస్ట్రీకి కేటాయించిన ప్రాంతంలో పడేసేవారని… అక్కడికి వెళ్లే దారి మూసివేయడంతో ఇప్పుడు కంపెనీల ముందున్న ఖాళీ స్థలాల్లోనే వ్యర్థాలను తగలబెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా అనేక చెట్లు, మొక్కలు కాలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

🏭 కెమ్టెక్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆరోపణలు
ఫైబర్ ఫ్యాబ్రిక్ తయారీ చేసే కంపెనీల్లో ఒకటైన “కెమ్టెక్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్” వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా దహనం చేస్తున్న విజువల్స్ బయటకు రావడం చర్చనీయాంశమైంది. కంపెనీ మాత్రం “మేము వేయలేదు… పక్క కంపెనీ వారు చేశారు” అంటూ ఆరోపణలను ఖండించినట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow